మారుతండ్రిని చంపి స్నాప్‌చాట్‌లో వీడియో... అమెరికాలో యువ‌కుడి దారుణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మారుతండ్రిని చంపి స్నాప్‌చాట్‌లో వీడియో... అమెరికాలో యువ‌కుడి దారుణం

  • చాకుతో మెడ దగ్గ‌ర పోట్లు
  • అరెస్టు చేసిన పోలీసులు
  • ఇంటి గొడ‌వ‌లే కార‌ణం
అమెరికాలోని కొలెరాడోకి చెందిన 19 ఏళ్ల యువ‌కుడు మారుతండ్రిని హ‌త్య చేసి ఆ వీడియోను స్నాప్‌చాట్‌లో అప్‌లోడ్ చేశాడు. నికోల‌స్ ఖ‌లీల్ విల్స‌న్, త‌న మారుతండ్రి ఆస్కార్ లెమార్‌కి మ‌ధ్య ఇంటి ఆర్థిక అవ‌స‌రాల‌కు సంబంధించి ఓ చిన్న గొడ‌వ జ‌రిగింది. అది మ‌న‌సులో పెట్టుకుని ఓ ప‌దునైన చాకు లాంటి వ‌స్తువు తీసుకుని లెమార్ మెడ ద‌గ్గ‌ర‌, భుజం మీద పొడిచాడు.

అంతేకాకుండా త‌న మారుతండ్రిని చంపిన‌ట్లుగా వెల్ల‌డిస్తూ ఓ వీడియో తీసుకుని స్నాప్‌చాట్‌లో కూడా అప్‌లోడ్ చేశాడు. వీడియో చూసిన స్నేహితులు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. ఆ వీడియోలో లెమార్ మృత‌దేహం ద‌గ్గ‌ర నికోల‌స్ త‌ల్లి సెలీనా ఏడుస్తుండటం కూడా ఉంద‌ని పోలీసులు చెప్పారు. హ‌త్య చేసిన అనంత‌రం నికోల‌స్ పారిపోవడానికి ప్ర‌య‌త్నించాడ‌ని, అత‌ని చేతికి కూడా గాయం అయింద‌ని పోలీసులు తెలిపారు.
snapchat
america
us
colorado

More Telugu News