suicide: ఉరివేసుకుని ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

షార్ట్స్‌లో చూడండి
చ‌దువుల‌ ఒత్తిడి, ప‌రీక్ష‌ల భ‌యం విద్యార్థుల ప్రాణాల‌ను తీస్తోంది. క‌డ‌ప జిల్లా కాశినాయ‌న మండ‌లం కోడిగుడ్ల‌పాడు గ్రామంలో ఇటువంటి విషాద ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, స‌ద‌రు విద్యార్థిని పోరుమామిళ్లలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. ఈ రోజు ఆమె ఇంగ్లీష్‌ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే, ఆమె కాలేజీకి వెళ్ల‌కుండా ఇంట్లోనే ఉండిపోయి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది. ప‌రీక్ష‌ల భ‌యంతోనే ఆమె ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింద‌ని ఆమె త‌ల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.          
Go Back to Shorts
suicide
kadapa
student

More Telugu News