'హలో' సినిమాలో అఖిల్ అదరగొట్టేశాడట!
- ఈ రోజునే విడుదలైన 'హలో'
- శీను పాత్రలో కనిపించిన అఖిల్
- ఎమోషన్స్ పండించడంలోను మంచి మార్కులు
తన చిన్ననాటి స్నేహితురాలిని కలుసుకోవడానికి తాపత్రయపడే యువకుడిగా అఖిల్ అద్భుతంగా నటించాడని అంటున్నారు. ఫైట్స్ .. డాన్స్ విషయంలోనే కాకుండా, ఎమోషన్స్ ను పండించడంలోను అఖిల్ శభాష్ అనిపించుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి ఎంతవరకూ చేయాలో అంతవరకూ అఖిల్ చేసేశాడంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.