యూపీ సీఎం ఇంటి ముందు సెల్ఫీ దిగితే...ఇక జైలుకేనట!
- యూపీ సీఎంకు పెరుగుతున్న ఉగ్రముప్పు
- కీలక నిర్ణయాలు ప్రకటించిన సెక్యూరిటీ అధికారులు
- హై సెక్యూరిటీ జోన్ లో ఆయన నివాసం
- సెల్ఫీలపై నిషేధం
లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఆదిత్యనాథ్ అధికారిక నివాసం ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఇంటి ముందు నుంచి వెళ్లేవాళ్లు సెల్ఫీలు దిగరాదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, చిక్కుల్లో పడ్డట్టేనని హెచ్చరిస్తూ పోలీసులు ఓ బ్యానర్ కట్టారు. అది వీఐపీ ఏరియా అని గుర్తు చేశారు. ఇదిలావుండగా, అఖిలేశ్ చేసిన ట్వీట్ వైరల్ కావడంతో, అధికారులు ఆ బ్యానర్ ను తొలగించడం గమనార్హం.