ఫేస్‌బుక్ ఫాలోవర్లలో కాజల్ రికార్డు.. 24 మిలియన్లకు చేరుకున్న అభిమానులు
- ఈ ఘనత సాధించిన మొదటి దక్షిణాది నటి
- కృతజ్ఞతలు తెలియజేసిన నటి
- 'క్వీన్' సినిమా రీమేక్‌లో నటిస్తున్న కాజల్
తెలుగుతో పాటు తమిళం, మలయాళం చిత్రాల్లో కూడా కాజల్ నటిస్తుండటం కూడా ఇందుకు ఒక కారణం. అంతేకాకుండా తన షూటింగ్‌లు, వ్యక్తిగత విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండటం కూడా ఫాలోవర్ల సంఖ్య పెరగడానికి తోడ్పడింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫొటో షేర్ చేసి అభిమానులకు కాజల్ కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం కల్యాణ్‌రామ్ సరసన 'ఎంఎల్ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి)', 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్'లోనూ కాజల్ నటిస్తోంది.