డిసెంబర్ మా ఫ్యామిలీకి కలిసొచ్చే నెల: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ మా ఫ్యామిలీకి కలిసొచ్చే నెల: నాగార్జున

  • సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు 
  • 'హలో'ను అప్పుడు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు 
  • అందుకే డిసెంబర్ 22న ఫిక్స్ చేశాం 
  • ఈ నెల మాకు సెంటిమెంట్ కూడా
నాగార్జున నిర్మాణంలో .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున బిజీగా వున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ " డిసెంబర్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చే నెల. నాన్నగారి కాలం నుంచి ఈ నెల మాకు కలిసొస్తోంది. అందువల్లనే ఈ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని  నిర్ణయించుకున్నాం" అని అన్నారు.

'హలో'తో పాటు నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' కూడా వస్తోంది. ఇదేదో కాంపిటేషన్ అని కొంతమంది అంటున్నారు.. నేనలా భావించడం లేదు. ఎందుకంటే సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చినా ఆడేస్తున్నాయి .. అలాంటిది ఇప్పుడు రెండు సినిమాలు రావడం వలన పెద్దగా సమస్య ఉండదనేది నా ఉద్దేశం. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి. అందువలన థియేటర్లు దొరకడం కష్టమైపోతుంది. అలాంటి స్టార్ హీరోల సినిమాలతో అఖిల్ పోటీ పడటం ఇప్పుడు వాడికి అంత మంచిది కాదు. 'హలో'ను సంక్రాంతికి విడుదల చేయకపోవడానికి ఇది కూడా ఒక కారణం" అని చెప్పుకొచ్చారు.    
nagarjuna
akhil

More Telugu News