1971 యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుందాం: భారత్ పై మరోసారి విషం కక్కిన హఫీజ్ సయీద్
- భారత్ నుంచి కశ్మీర్ ను వేరుచేయడమే లక్ష్యం
- 1971 యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటాం
- ప్రతి పాకిస్థానీ పగతో రగిలిపోతున్నాడు
తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)ను పాక్ నుంచి వేరు చేసినట్టే, భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలని మద్దతుదారులను ఉద్దేశించి సయీద్ అన్నాడు. డిసెంబర్ 16ను భారత్, బంగ్లాదేశ్ లు విజయ్ దివస్ గా జరుపుకోవడంపై మండిపడ్డాడు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. లక్షమంది పాక్ సైనికులను భారత సైన్యం బంధించింది. వారిని యుద్ధఖైదీలుగా అదుపులో ఉంచుకుంది. ఆ తర్వాత జరిగిన ఒప్పందాల్లో భాగంగా భారత్ పెద్ద మనసుతో వారందరికీ క్షమాభిక్ష ప్రసాదించి, విడుదల చేసింది.