ఎగ్జిట్ పోల్స్ తప్పు... గుజరాత్ లో గెలిచేది కాంగ్రెస్సే!: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- రేపు గుజరాత్ ఎన్నికల ఫలితాలు
- గెలిచేది కాంగ్రెస్ పార్టీయే
- అన్ని వర్గాలూ కాంగ్రెస్ కు అనుకూలం
- 75 శాతం ఓట్లు పడ్డాయన్న సంజయ్ కాకడే
మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గుజరాత్ లో నెలకొన్న సమస్యలపై దృష్టిని సారించలేదని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఓబీసీలు, పటేళ్లు, ముస్లింలు, దళితలు కాంగ్రెస్ వైపు నిలిచారని, విజయం ఆ పార్టీదేనని అన్నారు. కాగా, రేపు గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్టు ఈసీ పేర్కొంది.