సర్వత్ర సస్పెన్స్... చెన్నంపల్లి కోటకు చేరుకున్న అధికారులు!
- రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన చెన్నంపల్లి కోట
- భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు..20 అడుగుల లోతున సొరంగం
- దాని చివర భారీ ఎత్తున మెటల్..స్కానర్లలో వెల్లడైన నిజం
- బంగారమా? మరేదైనానా?
కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో పాటు అమరావతికి చెందిన పలువురు అధికారులు ఈ ప్రాంతానికి ఇప్పటికే చేరుకున్నారు. గుర్తింపు పొందిన అధికారులు మినహా మరెవరినీ కోటలోకి పంపించడం లేదు. ఈ ప్రాంతంలోని ప్రజలు సైతం కోట వద్దకు భారీగా చేరుకుని, ఏం జరుగుతుందోనన్న విషయాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కోటలోని ఓ గది కిందకు దాదాపు 20 అడుగుల లోతున ఉన్న ఓ రహస్య సొరంగాన్ని కనిపెట్టిన అధికారులు, ఇప్పుడు అది ఎక్కడకు దారి తీస్తుందోనన్న విషయాన్ని స్కానర్ల సాయంతో పరిశీలిస్తున్నారు. ఆ సొరంగం దారి తీస్తున్న ప్రాంతంలోనే భారీ ఎత్తున మెటల్ ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారన్న సంగతి తెలిసిందే.