అభిమానులను నేను ఎప్పుడూ విసుక్కోలేదు .. అదంతా రూమరే: యమున
- అభిమానులు సెల్ఫీ అడిగితే ఇస్తాను
- ఎవరినీ ఎవాయిడ్ చేయను
- వాళ్ల వల్లనే ఇక్కడ వున్నాను అనుకుంటాను
అందుకు యమున స్పందిస్తూ .. " ఏంటి సార్ ఇది .. ఇలాంటి గాసిప్స్ కూడా ఉంటాయా? ఇలా కూడా అనుకుంటారా? నేనెలా మాట్లాడతానో తెలియాలంటే నాతో మిమ్మల్ని షూటింగ్ కి తీసుకు వెళ్లాల్సిందే. అభిమానులు ఎవరు షూటింగ్ స్పాట్ కి వచ్చి సెల్ఫీ అడిగినా .. లేచి నుంచుని మరీ సెల్ఫీ ఇస్తాను. అందరికన్నా మీరే బెటరని కూడా వాళ్లు అంటూ వుంటారు. తోటి వాళ్లు ఎవాయిడ్ చేయమన్నా వినిపించుకోను .. వాళ్ల వల్లనే గదా మనం ఇక్కడ వున్నాం అని అంటూ వుంటాను. సెలబ్రిటీలను చూసినప్పుడు చిన్నప్పుడు నేను ఎలా ఫీలయ్యే దానినో .. అలాంటి ఫీలింగే కదా వాళ్లకి ఉంటుంది అనుకుంటాను" అని చెప్పుకొచ్చారు.