గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నలుపు దుస్తుల్లో హాజరుకానున్న నటీమణులు
- లైంగిక వేధింపులకు, లింగభేదానికి నిరసన
- కథనం రాసిన 'హాలీవుడ్ రిపోర్టర్' మేగజైన్
- జనవరి 7న జరగనున్న వేడుక
ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు నలుపు రంగు దుస్తుల్లో హాజరుకావాలని హాలీవుడ్ నటీమణులంతా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ చిత్రసీమను అతలాకుతలం చేస్తున్న హార్వీ వీన్‌స్టెన్ లైంగిక వేధింపుల వివాదం, 'మీ టూ' ఉద్యమంతో పాటు పారితోషికం విషయంలో లింగభేదం వంటి సమస్యలకు నిరసనగా వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రముఖ మేగజైన్ `హాలీవుడ్ రిపోర్టర్` తన కథనంలో పేర్కొంది. జనవరి 7న ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జరగనుంది.
అలాగే జనవరి 21న జరగనున్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డుల వేడుకలో అవార్డు అందజేసే వారందరూ మహిళలనే ప్రకటించిన తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా ప్రత్యేకత కోసం ఈ రకమైన ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.