2024లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న డ్వేన్ జాన్సన్
- వెల్లడించిన నటుడు
- యాక్టింగ్‌లో బిజీ కారణంగా 2024 వరకు ఆగక తప్పడం లేదన్న రాక్
- ప్రజలు ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేసిన డ్వేన్
అయితే గత కొద్దికాలంగా డ్వేన్ అమెరికా రాజకీయాల్లో అడుగుపెడతారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఆధారంగా తీసుకుని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ సర్వే కూడా నిర్వహించింది. ఆ సర్వేలో డ్వేన్ గెలిచే అవకాశాలు బాగానే ఉన్నట్లు పేర్కొంది. ఈ సర్వే చూసిన తర్వాత తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి మరింత పెరిగిందని డ్వేన్ అన్నారు. 'నేనెప్పుడూ రాజకీయాల్లోకి వస్తానని బహిరంగంగా చెప్పలేదు. కానీ ప్రజలు నన్ను రావాలని కోరుకుంటున్నట్లు ఈ సర్వే ద్వారా వెల్లడైంది. అందుకే వారి కోసమైనా దీని గురించి నేను సీరియస్‌గా ఆలోచిస్తాను' అని డ్వేన్ అన్నారు.