trivikram: వెంకటేశ్ తో కంటే ముందుగానే మహేశ్ తో త్రివిక్రమ్?

షార్ట్స్‌లో చూడండి
త్రివిక్రమ్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. అందువలన ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే అంతా ఆసక్తిని చూపుతుంటారు. అలా ఇప్పుడు అందరూ 'అజ్ఞాతవాసి' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఆయన ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ఇక వెంకటేశ్ తోను ఆయన ఒక సినిమాను చేయనున్నట్టు రీసెంట్ గా ఒక అధికారిక ప్రకటన వచ్చింది.

 అయితే అంతకంటే ముందుగానే ఆయన మహేశ్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వున్నట్టుగా టాక్. ఈలోగా వంశీ పైడిపల్లి సినిమాను మహేశ్ పూర్తి చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక వెంకటేశ్ కి త్రివిక్రమ్ వినిపించిన కథ మల్టీ స్టారర్ కథ అనీ .. ఈ మూవీలోనే మరో హీరోగా మహేశ్ చేయనున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమాలో మహేశ్ సోలో హీరోగా చేయనున్నాడా? మల్టీ స్టారర్ లో చేయనున్నాడా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.         
Go Back to Shorts
trivikram
venkatesh
Mahesh Babu

More Telugu News