హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో సీటు దొరికితే ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలుసా?... ఈ వీడియో చూడండి!
- ఆకట్టుకుంటున్న లూసియానా విద్యార్థి వీడియో
- వైరల్ అవుతున్న ఆర్టన్ లిటిల్ వీడియో
- అప్పుడే జాబ్ ఆఫర్ కూడా పొందిన ఆర్టన్
దానికి సంబంధించిన మెయిల్ చెక్ చేసుకుంటున్నప్పటి వీడియోను ఆర్టన్ పోస్ట్ చేశాడు. తాను హార్వార్డ్‌లో చదువుకోబోతున్నట్లు తెలిసి ఉబ్బితబ్బిబ్బవడం వీడియోలో చూడొచ్చు. పక్క నుంచి అతని స్నేహితులు కూడా ఆనందాన్ని పంచుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వీడియోలో ఆర్టన్ పొందుతున్న ఆనందం తమకు కళ్ల నుంచి నీళ్లు వచ్చేలా చేస్తోందని కొంతమంది నెటిజన్లు అన్నారు. అంతేకాదు.. ఈ వీడియో చూసిన యూట్యూబ్ గేమింగ్ హెడ్ ర్యాన్ వాయట్, డిగ్రీ పూర్తి చేసుకుని రాగానే గూగుల్‌లో జాబ్ సిద్ధంగా ఉంటుందని ఆఫర్ కూడా ఇచ్చారు. తాను కంప్యూటర్ సైన్స్ తీసుకుని పిల్లలు చదువుకోవడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తానని ఆర్టన్ అన్నాడు.