ఆసుపత్రి నుంచి స్వాతి ప్రియుడు రాజేష్ డిశ్చార్జ్.. అరెస్ట్!

  • స్వాతితో కలిసి దారుణానికి ఒడిగట్టిన రాజేష్
  • స్వాతి భర్తను హత్య చేసి ఆ స్థానంలోకి రావాలని ప్లాన్
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగానే అరెస్ట్ చేసిన పోలీసులు
తన ప్రియురాలితో జీవితాంతం కలిసుండాలన్న కోరికతో ఎవరూ చేయలేని దారుణానికి ఒడిగట్టిన రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలులో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఇప్పటికే ఆయన భార్య స్వాతి పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. స్వాతితో కలిసి ప్లాన్ చేసి, సుధాకర్ ను హత్య చేయడంతో పాటు, అతని స్థానంలోకి రావాలన్న ఆశతో, ముఖాన్ని కాల్చుకుని, ఆపై తానే సుధాకర్ నంటూ ఆసుపత్రిలో చేరిన ఘటన పోలీసు ఉన్నతాధికారులనే విస్మయ పరిచేలా చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు, రాజేష్ ఆహారపు అలవాట్లపై వచ్చిన తొలి అనుమానంతో బట్టబయలు కాగా, గత నాలుగు రోజులుగా రాజేష్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. స్వాతి భర్త హత్య కేసులో ఏ1 నిందితుడిగా రాహుల్ పేరును చేర్చిన పోలీసులు, కాలిన గాయాలు మానాయని, ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నామని అపోలో వైద్యులు ప్రకటించగానే అరెస్ట్ చేసి నాగర్ కర్నూలుకు తీసుకెళ్లారు.
Go Back to Shorts
Swathi
Rajesh
Sudhakar
Murder
Acid Attack

More Telugu News