ఆకట్టుకుంటున్న `అజ్ఞాతవాసి` రెండో పాట!
- విడుదల చేసిన సంగీత దర్శకుడు అనిరుధ్
- 'గాలి వాలుగా' అంటూ సాగే పాట
- అద్భుతమైన పదాలు రాసిన సిరివెన్నెల
చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఈ పాటను ట్వీట్ చేశాడు. అతనే స్వయంగా పాడిన ఈ పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాటతో పాటు విడుదల చేసిన పవన్ కల్యాణ్, కీర్తి సురేశ్‌ల ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ చిత్రంలోని మొదటి పాట `బైటికొచ్చి చూస్తే` అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.