shivsena: నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగిన శివసేన

షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశ రాజకీయాల స్థాయిని మోదీ దిగజార్చారని విమర్శించింది. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందని మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మొఘల్ సామ్రాజ్య సమాధులను మోదీ తవ్వారని తన పత్రిక సామ్నాలో వ్యాఖ్యానించింది.

ప్రచార సభల్లో మోదీ తీవ్ర భావోద్వేగంతో, దూకుడుగా ప్రవర్తిస్తున్నారని... ఇదంతా బీజీపీ దిగజారుడు రాజకీయాలను సూచిస్తోందని ఎద్దేవా చేసింది. మోదీ తనంతట తానే తన స్థాయిని తగ్గించుకుంటున్నారని తెలిపింది. దేశ ప్రధాని అయిన మోదీ... గుజరాత్ ఊబిలోనే చిక్కుకుపోయారని విమర్శలు గుప్పించింది.
Go Back to Shorts
shivsena
bjp
shivsena comments on modi
Narendra Modi

More Telugu News