ప్రేమగా చూసుకునే స్వాతి ఇలా చేసిందంటే అసహ్యం వేస్తోంది: సోదరుడు జైపాల్ కన్నీరు

  • బావ సుధాకర్ చాలా మంచి వ్యక్తి
  • పిల్లల బాధ్యత ఇక నాదే
  • స్వాతి సోదరుడు జైపాల్
తామెంతో ప్రేమగా చూసుకునే సోదరి స్వాతి ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నామని, విషయం తెలిసిన తరువాత తనకు అసహ్యం వేస్తోందని ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన స్వాతి సోదరుడు జైపాల్ కన్నీరు మున్నీరయ్యాడు. నాగర్ కర్నూల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, స్వాతిని ఎంతో ప్రేమగా పెంచామని, తమ బావ సుధాకర్ రెడ్డి చాలా మంచివాడని, ఇప్పుడు స్వాతిని ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు స్టేషన్ లో చూడాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పాడు.

స్వాతి, సుధాకర్ ల పిల్లల భవిష్యత్తును తానే చూసుకుంటానని అన్నాడు. కాగా, ఈ మధ్యాహ్నం సుధాకర్ అవశేషాలకు నాగర్ కర్నూలులో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన బంధువులు స్వాతిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమెను జైలుకు పంపకుండా తమ వద్ద వదిలివేయాలని, తామే తగిన శిక్ష విధిస్తామని డిమాండ్ చేశారు. కాగా, నేడు స్వాతిని కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
Jaipal
Swathi
Rahesh
Murder
Nagarkurnool

More Telugu News