మరో ట్విస్ట్... స్వాతి బండారం బట్టబయలైన విషయం తెలియని రాజేష్!

  • ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స
  • సుధాకర్ రెడ్డిగానే చికిత్స పొందుతున్న రాజేష్
  • రెండు రోజులుగా పోలీసుల అదుపులో స్వాతి
  • ఆమె లేకపోవడంతో రాజేష్ కు అనుమానం
  • నేడో, రేపో అరెస్ట్ చేస్తామంటున్న పోలీసులు
తన ప్రియురాలి కోసం ఆమె భర్తను దారుణంగా హతమార్చి, అతనిలా చలామణి అవ్వాలని భావించి, ముఖాన్ని స్వయంగా కాల్చుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ ఫిజియో థెరపిస్ట్ రాజేష్ కు ఇప్పటివరకూ జరిగిన ఉదంతం ఏమీ తెలియదని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికీ సుధాకర్ రెడ్డి పేరిటే అతను వైద్యం చేయించుకుంటున్నాడని, డాక్టర్లు కూడా తమ సూచన మేరకు ఆయన్ను సుధాకర్ గానే పిలుస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

స్వాతి అరెస్టయిన విషయం రాజేష్ కు తెలియదని, అయితే, గత రెండు రోజులుగా ఆమె ఆసుపత్రిలో కనిపించక పోవడంతో రాజేష్ కు అనుమానం వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు, ఒకసారి ఆయన నోటి వెంట స్వాతి పేరు వచ్చిన తరువాతే విషయం చెబుదామని వేచి చూస్తున్నారు. ఇక కేసులో రాజేష్ ఏ1 కావడం, ముఖానికి గాయాలు మానడంతో నేటి సాయంత్రం, లేదా రేపు ఉదయం రాజేష్ ను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అతనికి ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పుడే విషయం తెలిస్తే, ముందు జాగ్రత్త పడతాడని, దాని ఫలితంగా కేసు విచారణ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉన్నందునే ఇంకా చెప్పలేదని వెల్లడించారు.
Go Back to Shorts
Rahesh
Swati
Nagarkurnool
Acid attack
Murder

More Telugu News