Rahul Gandhi: వీఐపీ హోదాను పక్కనబెట్టి... అందరిలో ఒకరిగా క్యూలైన్లో రాహుల్... వైరల్ అవుతున్న చిత్రమిది!

  • మిగతా ప్రయాణికులతో పాటు క్యూలో రాహుల్ గాంధీ
  • ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయలుదేరిన వేళ ఘటన
  • ఫోటోను పంచుకున్న ఇండిగో
భేషజాలకు పోకుండా, వీఐపీనన్న హోదాను పక్కనబెట్టి, విమానం ఎక్కేందుకు తన వంతు కోసం వేచి చూస్తూ, క్యూలైన్ లో నిలుచుని ఉన్న రాహుల్ గాంధీ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తల్లి సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ఎన్నికల ప్రచారానికి కాసింత విరామమిచ్చి న్యూఢిల్లీ వచ్చిన రాహుల్, తిరిగి అహ్మదాబాద్ కు బయలుదేరిన వేళ, ఆయన టికెట్ ఇండిగో విమానంలో బుక్ అయింది.

బోర్డింగ్ పాస్ తీసుకుని, రన్ వేపై ఉన్న విమానం ఎక్కేందుకు వచ్చిన ఆయన, తనకున్న ప్రత్యేక సౌకర్యాన్ని కాదని, మిగతావారితో సమానంగా క్యూలో నిలుచున్నారు. ఈ దృశ్యాన్ని ఫోటో తీసిన ఇండిగో, "వెల్ కమ్ ఆన్ బోర్డ్ మిస్టర్ రాహుల్ గాంధీ. హ్యావ్ ఏ గుడ్ ఫ్లయిట్" అంటూ ఓ ట్వీట్ ను ఉంచింది. ఈ ట్వీట్ ను చూసిన వారిలో పలువురు రాహుల్ ను మెచ్చుకుంటుండగా, కొంతమంది ఇటీవల ఇండిగో విమానాల్లో చోటు చేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రశ్నలు సంధిస్తున్నారు.
Rahul Gandhi
Indigo
New Delhi
Sonia gandhi
Ahmadabad

More Telugu News