Narayan Rane: బాల్ థాకరేను చిత్ర హింసలు పెట్టిన ఉద్ధవ్... త్వరలో సంచలన నిజాలు వెలుగులోకి: నారాయణ్ రానే

  • కుటుంబీకులతో కలిసి బాలా సాహెబ్ ను హింసించిన ఉద్ధవ్ 
  • 'మాతోశ్రీ'లో ఏం జరిగేదో నాకు తెలుసు
  • మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రానే
ప్రస్తుతం శివసేన అధ్యక్షుడిగా ఉన్న ఉద్ధవ్ థాకరే, తన తండ్రి బాల్ థాకరేను చిత్ర హింసలు పెట్టాడని, ఆ విషయాలన్నీ త్వరలోనే వెలుగులోకి వస్తాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రానే సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్ థాకరేను తాను వేధించినట్టు ఉద్ధవ్ ఆరోపించిన నేపథ్యంలో రానే మీడియా ముందుకు వచ్చారు.

"బాలా సాహెబ్ ను ఉద్ధవ్, ఆయన కుటుంబ సభ్యులు హింసిస్తుంటే ఈ కళ్లతో చూశాను. ఇకనైనా నా గురించి అవాకులు చవాకులు పేలడాన్ని ఆపకుంటే, వాటన్నింటినీ బయటకు తెస్తా" అని ఆయన హెచ్చరించారు. బాలాసాహెబ్ బతికున్న సమయంలో తాను ఎన్నడూ ఆయన మాట జవదాటలేదని, ఆయన నివాసమైన మాతోశ్రీలో ఏం జరుగుతూ ఉండేదన్న విషయం తనకు తెలుసునని, తనపై ఆరోపణలు ఆపకుంటే వాటన్నింటినీ బయటకు తెస్తానని అన్నారు.
Narayan Rane
Maharashtra
Sivasena
Uddhav Thakare
Balasaheb

More Telugu News