Virat Kohli: తన పెళ్లికి ఇద్దరే క్రికెటర్లను పిలిచిన విరాట్ కోహ్లీ!

  • 12న ఇటలీలో వివాహం
  • సచిన్, యువరాజ్ లకు ఆహ్వానం
  • మిగతావారు రిసెప్షన్ కే పరిమితం
  • శ్రీలంకతో సిరీస్ ఉండటమే కారణం
పైకి అధికారికంగా చెప్పకపోయినా, 12వ తేదీన తన ప్రేయసి మెడలో తాళికట్టబోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇద్దరంటే ఇద్దరే క్రికెటర్లను పెళ్లికి పిలిచాడు. తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ తో పాటు, యువరాజ్ సింగ్ ను తన వివాహానికి విరాట్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇటలీలోని మిలన్ లో ఉన్న ఓ లగ్జరీ రిసార్టులో వీరిద్దరి పెళ్లి జరగనుందన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే కోహ్లీ, అనుష్కల బంధువులు వేర్వేరు మార్గాల్లో ఇటలీ వెళ్లిపోయారు. రేపటి నుంచి వివాహ వేడుకలు సంగీత్ తో ప్రారంభమవుతాయని సమాచారం. ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్ జరుగుతున్నందున, జట్టులో ఉన్న క్రికెటర్లను విరాట్ ఆహ్వానించలేదని తెలుస్తుండగా, అందరికీ ముంబైలో జరిగే విందుకు ఆహ్వానం అందినట్టు సమాచారం.
Virat Kohli
Anushka
Italy
Marriage

More Telugu News