అటువంటి సినిమాలు చేయాలంటే నాకు చాలా భయం: అక్కినేని అఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అటువంటి సినిమాలు చేయాలంటే నాకు చాలా భయం: అక్కినేని అఖిల్

  • ఫేస్‌బుక్ లైవ్‌లోకి వ‌చ్చిన అక్కినేని వార‌బ్బాయి
  • ఒక క్రికెటర్‌గా ఏ ఆటగాడి కథను రీమేక్‌ చేస్తారని అభిమాని ప్ర‌శ్న‌
  • రీమేక్‌ సినిమాలంటే భ‌య‌మ‌ని స‌మాధానం
అక్కినేని వారి అబ్బాయి అఖిల్ న‌టించిన 'హ‌లో' సినిమా ఈ నెల 22న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అఖిల్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో లైవ్‌లోకి వ‌చ్చాడు. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం చెప్పాడు. ఒక క్రికెటర్‌గా ఏ ఆటగాడి కథను రీమేక్‌ చేస్తారని ఓ అభిమాని ఆయ‌న‌ను అడ‌గ‌గా... తాను ఇప్ప‌ట్లో ఏ రీమేక్‌ సినిమానూ చేయన‌ని, అసలు అటువంటి సినిమాలు చేయాలంటే త‌న‌కు చాలా భయం అని అన్నాడు.

ఒక‌వేళ చేస్తే సచిన్‌, ధోని, విరాట్‌ కోహ్లి లాంటి వారి స్ఫూర్తినిచ్చే కథలై ఉండాలని అన్నాడు.  తాను భ‌విష్య‌త్తులో చేయ‌బోయే సినిమాల‌ను ఇప్పుడేమీ చెప్పనని తెలిపాడు. ఇప్పుడు త‌న‌ దృష్టి అంతా ‘హలో’పైనే ఉంద‌ని అన్నాడు. ప్రతి సినిమా త‌న‌కు ముఖ్యమైనదేన‌ని చెప్పాడు. కాగా, త‌న‌కు ఇష్ట‌మైన ఆహారం అంటూ ఏదీ లేద‌ని, ఏ ఆహార ప‌దార్థమైనా ఇష్టమేన‌ని చెప్పాడు. షూటింగ్‌ సమయంలో మాత్రమే తాను డైట్‌ ఫాలో అవుతాన‌ని, మిగిలిన రోజుల్లో బాగా తినేస్తాన‌ని తెలిపాడు. అఖిల్ సంభాష‌ణ మీరూ వినండి...
akhil
hello
face book
answers

More Telugu News