Ramcharan: రామ్‌చ‌ర‌ణ్ 'రంగ‌స్థ‌లం' ఫ‌స్ట్‌లుక్‌కి అభిమానుల పాలాభిషేకం, పూజ‌లు

షార్ట్స్‌లో చూడండి
తాజాగా విడుద‌లైన 'రంగ‌స్థ‌లం 1985' రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్‌లుక్‌కి ఆయ‌న అభిమానులు పాలాభిషేకం చేసి, గుళ్ల‌లో పూజ‌లు నిర్వ‌హించారు. ఫ‌స్ట్‌లుక్ ఫొటోల‌ను బైకుల‌కు అంటించుకున్నారు. కేకులు క‌ట్ చేసి ఒక‌రికొక‌రు శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు. వారి కోలాహ‌లాన్ని ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. వారి ఉత్సాహానికి కార‌ణం ఫ‌స్ట్‌లుక్‌కి సానుకూల స్పందన, ప్ర‌శంస‌లు రావ‌డ‌మే. ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర‌లో న‌టిస్తున్న రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్‌లుక్‌ని, తండ్రి చిరంజీవి పోషించిన ముఠామేస్త్రి పాత్ర‌తో పోల్చి చూస్తున్నారు అభిమానులు.

  
Go Back to Shorts
Ramcharan
Chiranjeevi
rangasthalam
sukumar

More Telugu News