తన మీద దాడి జరిగిందంటూ వచ్చిన వార్తలపై మండిపడ్డ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్
- చిన్న గొడవను పెద్దదానిగా సృష్టించారని వ్యాఖ్య
- తన కుటుంబ సభ్యులు బాధపడ్డారన్న నటుడు
- ట్వీట్‌లో మీడియా సంస్థపై అసంతృప్తి
నిజానికి షూటింగ్ సెట్‌లో జరిగిన చిన్న అల్లరిని, వెబ్‌సైట్ మీద ప్రభావం పడటం కోసం దాడి, గాయాలు వంటి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించడం సబబుకాదని అర్జున్ హితవు పలికారు. ఈ మేరకు ఆయన సంబంధిత వెబ్‌సైట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. వార్త రాసే ముందు సంఘటన గురించి కొంచెం పరిశోధించి రాయాలని సూచించారు.