ఓ సారి చిరూ ఇంటికి వెళ్లాను .. అప్పుడే పవన్ కలిశారు!: యమున
- ఆ మూవీలో పవన్ నటన ఇష్టం
- ఆయన హీరో కావడానికి ముందే కలిశాను
- ఎంతో బాగా మాట్లాడతారు
"పవన్ ని ఒకసారి కలిశాను .. అప్పటికి ఆయన ఇంకా హీరో కాలేదు. ఓసారి న్యూ ఇయర్ సందర్భంగా స్వీట్స్ తీసుకుని చిరంజీవిగారి ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన టెంపుల్ కి వెళ్లారు .. అప్పుడే అక్కడ పవన్ ను చూశాను. "అన్నయ్య వాళ్లు కాసేపట్లో వచ్చేస్తారు కూర్చోండి" అంటూ ఆయన మర్యాద పూర్వకంగా ఆహ్వానించి .. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనతో మాట్లాడిన సంఘటన అలా గుర్తుండిపోయింది. ఆ తరువాత చిరంజీవి గారు రాగానే స్వీట్స్ ఇచ్చి విషెష్ చెప్పేసి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చారు.