నా విషయంలో బాలచందర్ గారు చెప్పినట్టుగానే జరిగింది!: యమున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా విషయంలో బాలచందర్ గారు చెప్పినట్టుగానే జరిగింది!: యమున

  • నా అసలు పేరు 'ప్రేమ' 
  • 'యమున'గా బాలచందర్ గారు మార్చారు 
  • 100 డేస్ వేదికపై ఆయన ఆ మాట అన్నారు   
తెలుగులో కథానాయికగా మంచి కథాబలమున్న చిత్రాల్లో యమున నటించారు. బరువైన పాత్రల్లోనూ ఆమె మెప్పించగలదని నిరూపించారు. అలాంటి యమున ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. " నా అసలు పేరు 'ప్రేమ' .. నా మొదటి సినిమా 'సిస్టర్ నందిని' షూటింగ్ సమయంలో బాలచందర్ గారు 'యమున'గా మార్చారు" అని అన్నారు.

 "ఆ సినిమాలో సుహాసినికి చెల్లెలుగా నటించాను .. హిట్ అయింది. హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లో మెమెంటో ఇవ్వడానికి నన్ను స్టేజ్ మీదకి పిలిచి, 'భవిష్యత్తులో ఈ అమ్మాయి నాకు డేట్స్ ఇవ్వనంత బిజీ అవుతుంది' అన్నారు బాలచందర్ గారు. ఆ తరువాత నిజంగా అదే జరిగింది. ఆయన దర్శకత్వం వహించే రెండు .. మూడు సినిమాలకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాను. ఆయన బ్యానర్లో సినిమాలే కాదు .. సీరియల్స్ కి అడిగినా చేయలేకపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.         
yamuna
balachandar

More Telugu News