ఫస్టు టైమ్ సుహాసినికి డబ్బింగ్ చెప్పాను .. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది: రోజా రమణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫస్టు టైమ్ సుహాసినికి డబ్బింగ్ చెప్పాను .. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది: రోజా రమణి

  • ఒరియా సినిమాలు చేయడంతో చక్రపాణితో పరిచయం 
  • పెద్దల అంగీకారంతో పెళ్లి 
  • బాబు పుట్టిన కొంత కాలానికి డబ్బింగ్ వైపుకు 
  • డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు    
తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో రోజా రమణి మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. " ఒరియా సినిమాలు చేస్తున్నప్పుడు చక్రపాణిగారితో పరిచయం కావడం .. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తిచేసిన తరువాతనే పెళ్లి చేసుకున్నాను. ఆ తరువాత బాబు పుట్టిన తరువాత ఆలనా పాలన చూస్తూ ఉండిపోయాను".

 "బాబుకు రెండున్నర సంవత్సరాలు వచ్చేవరకూ సినిమాలపై దృష్టి పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లోనే సుహాసినికి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ రావడంతో ఓకే చెప్పాను. ఆ తరువాత సుహాసిని బాగా పాప్యులర్ అయిపోయింది. దాంతో వరుసగా ఆమెకి ఓ 15 .. 20 సినిమాలకి డబ్బింగ్ చెబుతూ వచ్చాను. ఆ తరువాత ఇతర భాషలకి చెందిన కథానాయికల రాక పెరిగింది. దాంతో వాళ్లకి కూడా డబ్బింగ్ చెప్పవలసి రావడంతో బాగా బిజీ అయ్యాను. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా నాకు మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.   
roja ramani
suhasini

More Telugu News