తమిళ సినీ సంగీత దర్శకుడు ఆదిత్యన్ మృతి!
- తన కూతురిని చూడడానికి హైదరాబాద్ వచ్చిన ఆదిత్యన్
- కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిన సంగీత దర్శకుడు
- రేపు చెన్నైలో అంత్యక్రియలు
ఆదిత్యన్ తమిళం, మలయాళం, తెలుగు సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. పలు తమిళ పాప్, రీమిక్స్ ఆల్బమ్స్ ను ఆయన రూపొందించారు. సీవల్ పేరి పాండి, నాయల సైది వంటి సినిమాలకు ఆయన అందించిన సంగీతం ప్లస్ పాయింట్ గా నిలిచింది.