'రేయ్... నాకు చెప్పకుండా చేస్తున్నావా?': అఖిల్ పై నాగ్ చిరుకోపం

  • నేడు విడుదల కానున్న 'హలో' ఆడియో
  • అంతవరకూ ఆగలేనన్న అఖిల్
  • నాకు చెప్పకుండా చేస్తున్నావా? అన్న నాగార్జున
  • పాట క్లిప్పింగ్ ను పోస్టు చేసిన నాగ్
"రేయ్... అఖిల్ నువ్వు ఇవాళ ఓ సాంగ్ ను లాంచ్ చేస్తున్నావన్న విషయాన్ని నాకు చెప్పనేలేదు" అంటూ నాగార్జున తన కుమారుడు అఖిల్ పై చిరుకోపాన్ని ప్రదర్శించాడు. 'హలో' ఆడియో విడుదల నేడు జరగనున్న వేళ, అంతవరకూ వెయిట్ చేయలేనని, ముందే 'సమ్ థింగ్' లాంచ్ చేయనున్నానని అఖిల్ చెప్పగా, నాగ్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందించాడు. "నువ్వు రిలీజ్ చేయబోయే సాంగ్ ఇదేనా?" అంటూ ఓ పాట క్లిప్పింగ్ ను పోస్ట్ చేశాడు. తాను 'హలో' పాటల సెట్ ను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పాడు. కాగా, అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 22వ తేదీన వెండితెరలను తాకనుంది.
Go Back to Shorts
Nagarjuna
Akhil
Hello
Audio Launch

More Telugu News