సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

06-12-2017 Wed 07:25
  • హీరోతో ఈక్వల్ అంటున్న 'పెళ్లిచూపులు' భామ
  • మలయాళం సినిమాపై కల్యాణ్ రామ్ మోజు
  • యూ ట్యూబ్ లో మరోసారి బన్నీ దూకుడు 
  • యంగ్ హీరో చిత్రానికి మంచి డిమాండ్    
*  'పెళ్లిచూపులు' నాయిక రీతూవర్మకు తెలుగులో అవకాశాలు ఎలా వున్నా, తమిళంలో మాత్రం మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే విక్రం హీరోగా గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న 'ధ్రువ నక్షత్రం' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా దుల్కర్ సల్మాన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. దీని గురించి చెబుతూ, "ఈ కథ నాకు బాగా నచ్చింది. హీరోతో సరిసమానంగా వుండే పాత్ర నాది. నాకు మంచి పేరు వస్తుంది. దుల్కర్ తో కలసి నటించడం మరింత సంతోషంగా వుంది" అని చెప్పింది. ఈ సినిమా పేరు 'కన్నుం కన్నుం కొల్లై అడిత్తాల్'.          
*  ప్రస్తుతం 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రంతో పాటు జయేంద్ర దర్శకత్వంలో మరో చిత్రాన్ని కూడా చేస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ త్వరలో ఓ మలయాళం రీమేక్ లో నటించే అవకాశం వుంది. దిలీప్ హీరోగా నటించిన 'రామ్ లీలా' మలయాళ చిత్రం కల్యాణ్ రామ్ కు బాగా నచ్చిందని, దానిని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.
*  యూ ట్యూబ్ లో అల్లు అర్జున్ తన దూకుడు చూపిస్తున్నాడు. ఆమధ్య తను నటించిన 'సరైనోడు' చిత్రం హిందీ అనువాద వెర్షన్ ను యూ ట్యూబ్ లో ఉంచగా అది 42 రోజుల్లో 50 లక్షల మిలియన్ల వ్యూస్ ను పొందగా, తాజాగా 'దువ్వాడ జగన్నాథం' హిందీ వెర్షన్ కేవలం 15 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ ను దాటేయడం విశేషం.
*  యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న 'ఛలో' చిత్రం నిర్మాణంలో ఉండగానే మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ 2.2 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రష్మిక మండన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నారు.