venkatesh: వెంకటేశ్ 'ఆటా నాదే వేటా నాదే'లో అనుష్క!

షార్ట్స్‌లో చూడండి
తేజ దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా 'ఆటా నాదే వేటా నాదే' సినిమా, రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో, డిఫరెంట్ లుక్ తో వెంకటేశ్ కనిపించనున్నాడని అంటున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా కాజల్ .. తమన్నా పేర్లు వినిపించాయి. తాజాగా అనుష్క పేరు తెరపైకి వచ్చింది. కాజల్ .. తమన్నా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వలన వాళ్లను పక్కన పెట్టేసినట్టుగా టాక్. ఇక 'భాగమతి'ని పూర్తిచేసిన అనుష్క డేట్స్ దొరకడం వలన ఆమెను తీసుకున్నట్టుగా సమాచారం. గతంలో వెంకటేశ్ - అనుష్క కాంబినేషన్లో 'చింతకాయల రవి' .. ' నాగవల్లి' వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజమే అయితే, మరోసారి ఈ జంట తెరపై సందడి చేయడం ఖాయమేనని చెప్పొచ్చు. 
Go Back to Shorts
venkatesh
anushka

More Telugu News