'హిందుస్థాన్ జిందాబాద్' అంటూ రాసిన పాకిస్థానీ యువ‌కుడు.. అరెస్టు చేసిన పోలీసులు!

  • ఇంటిగోడ మీద రాసిన సాజిద్ షా
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • జాతి వ్య‌తిరేకి అనే నెపంతో అరెస్టు
'హిందూస్థాన్' అనే ప‌దం మీద ప్రేమ‌తో పాకిస్థాన్‌లోని నార అమ‌జై ప్రాంతానికి చెందిన సాజిద్ షా అనే యువ‌కుడు త‌న ఇంటి గోడ మీద 'హిందూస్థాన్ జిందాబాద్' అని రాశారు. ఇది చూసిన స్థానికులు ఆ రాత‌ల‌ను తుడిపేయాల‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ సాజిద్ విన‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్క‌డికి విచ్చేసిన ఖైబ‌ర్ ప‌ఖ్తుంఖ్వా పోలీసులు పాకిస్థాన్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 505 ప్ర‌కారం జాతి వ్య‌తిరేక నేరం కింద సాజిద్‌ను అరెస్టు చేశారు.
Go Back to Shorts
hindusthan
zindabad
pakistan
youth
arrest
ppc

More Telugu News