సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సమస్యలకు తమన్నా చూపే పరిష్కారం
  • నాగార్జున, వర్మల చిత్రం 'సిస్టం'?
  • దర్శకుడిగా మారుతున్న ఫైట్ మాస్టర్ 
  • 'మెహబూబా' కోసం రోడ్లపై చేజింగ్  
*  ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తాను మూడు సూత్రాలు పాటిస్తానని చెబుతోంది మిల్కీ వైట్ భామ తమన్నా. "సమస్యలన్నాక ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో వస్తాయి. అయితే, అలా వచ్చినప్పుడు కంగారుపడిపోకుండా నిదానంగా ఆలోచించాలి. నా వరకు నేను మూడు సూత్రాలు పాటిస్తాను. మొదటిగా ఆ సమస్యను ఒప్పుకోవడం, లేకపోతే దానిని ఏదైనా మార్చడానికి వీలవుతుందేమో చూడాలి. అంటే పరిష్కారంలోనే కొత్త దారి వెతుక్కోవడం అన్న మాట. అదీగాకపోతే, దానిని వదిలేసేయడమే, ఎలా జరిగేది అలా జరుగుతుంది" అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.  
*  చాలా కాలం తర్వాత నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం 'సిస్టం' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. ఆర్.కంపెనీ బ్యానర్ పై నిర్మితం అవుతోన్న ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయికగా నటిస్తోంది.
*  'బాహుబలి' వంటి భారీ యాక్షన్ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసి, పేరు తెచ్చుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ త్వరలో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. తల్లీ కూతుళ్ల మధ్య సాగే భావోద్వేగపూరిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తానని ఆయన చెప్పాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.
*  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజా చిత్రం 'మెహబూబా' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. హీరో, విలన్ల బ్యాచ్ పై ఓ చేజింగ్ ఎపిసోడ్ ను హైదరాబాదు రోడ్లపై చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా నటిస్తున్నారు.  
Thamanna
Nagarjuna
Peter
Puri Jagannadh

More Telugu News