ఆలస్యానికి మమ్మల్ని క్షమించండి: సుప్రీంకోర్టు అరుదైన వ్యాఖ్య
- ఓ మహిళ కేసు విచారణ పదేళ్లు ఆలస్యం
- సుప్రీంకోర్టులోనే ఎనిమిదేళ్లు సాగిన విచారణ
- విచారణ దశలోనే మరణించిన ఫిర్యాదిదారు
- పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం
స్థానిక కోర్టులో ఓ తీర్పు, ఆపై ఉత్తరాఖండ్ హైకోర్టులో మరో తీర్పు వచ్చాయి. ఆపై ఫిర్యాదిదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం, ఇలా పరస్పర విరుద్ధ తీర్పులు రావడంతో కేసు వ్యవహారం గందరగోళంగా మారిందని చెబుతూ, ఆదిలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పే ఈ కేసుకు వర్తిస్తుందని చెబుతూ, విచారణ పదేళ్లు ఆలస్యమైనందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ, క్షమాపణలు కోరింది. అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు 2009 నుంచి సాగుతుండగా, కేసు వేసిన కొద్ది రోజులకే శ్యామలత మరణించడం గమనార్హం.