bigg boss 11: అక్షయ్ కుమార్, హృతిక్ తో నటించడం అంటే ఇష్టం: కత్రినా కైఫ్

షార్ట్స్‌లో చూడండి
 బాలీవుడ్ లో సల్మాన్ మినహా అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లతో నటించడం అంటే ఇష్టమని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తెలిపింది. 'బిగ్ బాస్ సీజన్ 11'కు 'టైగర్ జిందాహై' సినిమా ప్రమోషన్ నిమిత్తం వెళ్లిన కత్రినా ఆ షో వ్యాఖ్యాత సల్మాన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది.

'అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్ లలో ఎవరంటే ఇష్టం? ఎవరిని చంపుతావు? ఎవరిని తిరస్కరిస్తావు?' అని అడిగిన ప్రశ్నకు 'అభిషేక్ ని తిరస్కరిస్తా, అనిల్ ని చంపుతా, అక్షయ్ ని ఇష్టపడతా' అని చెప్పింది. 'షారూఖ్ ఖాన్ ఇష్టమా?, అక్షయ్ ఇష్టమా?' అని అడిగితే 'అక్షయ్ ఇష్టమ'ని చెప్పింది.  

 అనంతరం లైడిటెక్టర్ ఆట ఆడించిన సల్మాన్... 'నన్ను మొదటి సారి చూసినప్పుడు నేను నీకు నచ్చలేదు?' అన్నాడు. దానికి కత్రినా సమాధానమిస్తూ..'అది అబద్దం' అని చెప్పింది. 'నేనంటే నీకు ఇష్టం లేదు' అన్నాడు. దానికి నవ్వేసింది. అనంతరం 'బాలీవుడ్ లో నువ్వు ఎవరితో క్లోజ్ గా ఉంటావు?' అని సల్మాన్ అడిగితే కత్రినా 'అలియా భట్' అని చెప్పింది.

దానికి రెడ్ లైట్స్ వెలగడంతో 'అబద్దం చెబుతున్నావ'ని సల్మాన్ అన్నాడు. 'మెషీన్ అబద్దం చెబుతోంద'ని కత్రినా చెప్పింది. దానికి 'మెషీన్ అలా చెప్పడం లేదని, ఇద్దరు ఆడవాళ్లు స్నేహితులు కావడం అసాధ్యమని చెబుతోంద'ని అన్నాడు. దాంతో కత్రినా నవ్వేసింది. 
Go Back to Shorts
bigg boss 11
Salman Khan
katrina khaif

More Telugu News