వారణాసిలో షూటింగ్ పూర్తి చేసిన 'అజ్ఞాతవాసి'
- కాశీ నుంచి తిరిగొచ్చిన 'అజ్ఞాతవాసి' టీమ్
- సంగీత దర్శకుడిగా అనిరుథ్
- 18 .. 19 తేదీలలో ఆడియో రిలీజ్
- జనవరి 10వ తేదీన సినిమా విడుదల
అక్కడి నుంచి తిరిగొచ్చిన ఈ సినిమా టీమ్ ఆడియో రిలీజ్ పై దృష్టి పెట్టనుంది. ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. ఆయన అందించిన ఆల్బమ్ ను ఈ నెల 18వ తేదీన గానీ .. 19వ తేదీన గాని విడుదల చేయనున్నారు. కథాకథనాలతో పాటు పవన్ యాక్షన్ సీన్స్ .. పాటలు ఈ సినిమా హైలైట్స్ లో భాగం కానున్నాయని చెబుతున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కీర్తి సురేష్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.