లవ్ జిహాద్‌కు కౌంటర్.. హిందూ యువకులతో ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లకు ఆరెస్సెస్ అనుబంధ సంస్థ రెడీ.. 2 వేల పెళ్లిళ్లకు ముహూర్తం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లవ్ జిహాద్‌కు కౌంటర్.. హిందూ యువకులతో ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లకు ఆరెస్సెస్ అనుబంధ సంస్థ రెడీ.. 2 వేల పెళ్లిళ్లకు ముహూర్తం!

  • ముస్లిం కోడళ్లను ఇంటికి తీసుకురావాలంటూ స్లోగన్
  • పెళ్లిళ్ల ఖర్చును భరించి రక్షణ కల్పించనున్న హెచ్‌జేఎం
  • వారికి వారి భాషలోనే సమాధానం చెబుతామని హెచ్చరిక
హిందూ యువకులతో ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లు జరిపించేందుకు ఆరెస్సెస్ అనుబంధ సంస్థ హిందూ జాగరణ్ మంచ్ (హెచ్‌జేఎం)  సమాయత్తమవుతోంది. ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా ‘బేటీ బచావో, బాహు లావో’ (ఆడపిల్లలను రక్షించు.. కోడళ్లను తీసుకురా) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘బేటీ బచావో.. బేటీ పడావో’ ప్రచార స్లోగన్‌ను వాడుకోవడం గమనార్హం.

హిందూ యువకులను వివాహం చేసుకోవాలని భావించే ముస్లిం యువతులకు అండగా నిలిచి, వారికి రక్షణ కల్పించి వివాహాలు చేయనుంది. మొత్తంగా 2100 ముస్లిం యువతుల వివాహాలు జరిపించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించనుంది.

 ‘‘వారికి  వారి భాషలోనే సమాధానం చెబుతాం’’ అని హెచ్‌జేఎం రాష్ట్ర చీఫ్ అజ్జు చౌహాన్ తెలిపారు. మతాంతర వివాహాల వల్ల జనాభాను నియంత్రించడం కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ‘లవ్ జిహాద్’ను ఆపకుంటే ముస్లిం యువతులను ఆకర్షించేందుకు బజరంగ్ దళ్ యువకులను పంపించాల్సి ఉంటుందని ఇటీవల విశ్వహిందూ పరిషత్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Love Jihad
Muslim
Hindu
Marraiage
RSS
HJM

More Telugu News