గోల్కొండ కోటలో కేసీఆర్ విందు షురూ!
- గోల్కొండ కోటలో జీఈఎస్ అతిథులకు విందు
- 150 దేశాలకు చెందిన 1500 మంది అతిథులు
- కేసీఆర్ ఇస్తున్న విందులో వివిధ రకాల ఆహారపదార్థాలు
గోల్కొండ కోటలోని పచ్చిక బయళ్లలో ఈ విందు జరుగుతోంది. ఈ విందులో తెలంగాణ, హైదరాబాదు ప్రతిష్ఠను పెంచే ఘుమఘుమలాడే వంటకాలను వండి వార్చారు. విదేశీ రుచులతో పాటు బిర్యానీ, మొఘలాయ్, ఇటాలియన్, చైనీస్ రకాల వంటకాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రకృతి, కోట అందాలను వీక్షిస్తూ అతిథులు డిన్నర్ ను ఆస్వాదిస్తున్నారు.