సిర్సా అల్లర్ల కేసులో ఏ1 నిందితురాలు హనీప్రీత్

  • సిర్సా అల్లర్లకు కారణం హనీప్రీత్ సింగ్
  • ఛార్జిషీట్ లో ఏ1 నిందితురాలిగా హనీ ప్రీత్
  • అల్లర్లు, దాడులకు 1.25 కోట్లు సుపారీ
డేరాబాబా గుర్మీత్ రాం రహీం సింగ్ అరెస్టు సందర్భంగా సిర్సాలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లకు కారణమైందనే కారణంతో డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ను ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో వుంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టులో పోలీసు అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో ఏ1 నిందితురాలిగా హనీప్రీత్ ను పేర్కొన్నారు. ప్లాన్ ప్రకారం అల్లర్లు చెలరేగేలా చేసి, దాడులు నిర్వహించేందుకు 1.25 కోట్ల రూపాయలు ఇచ్చారని అందులో వారు తెలిపారు. 
Go Back to Shorts
hani preet
dera baba
sirsa
attacks

More Telugu News