Big TV: 'బిగ్‌ టీవీ'ని అమ్మేసిన అనిల్ అంబానీ

  • అప్పులను తగ్గించుకోవడానికి విక్రయం
  • పెంటెల్, వీకాన్ మీడియాతో డీల్
  • కస్టమర్లకు సేవలు కొనసాగుతాయన్న ఆర్ కామ్

తమకున్న అప్పులను తగ్గించుకోవడంలో భాగంగా డీటీహెచ్‌ (డైరెక్ట్ టు హోమ్) సేవల బ్రాండ్ బిగ్‌ టీవీని విక్రయించినట్టు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన అనిల్ అంబానీ నేతృత్వంలోని సంస్థ, పెంటెల్‌ టెక్నాలజీస్‌, వీకాన్‌ మీడియా అండ్‌ టెలివిజన్‌ కు బిగ్ టీవీని విక్రయించినట్టు పేర్కొంది. అయితే ఎంత మొత్తానికి డీల్ కుదిరిందన్న విషయాన్ని మాత్రం ఆర్ కామ్ వెల్లడించలేదు.

తమ రుణ భారాన్ని తగ్గించేందుకు ఈ లావాదేవీ ఉపయుక్తకరమని, డీల్ తరువాత, ఆర్‌ కామ్‌ వాటాదార్లకు, రుణదాతలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. తాము బిగ్ టీవీని విక్రయించినా, తమ సేవలను వాడుకుంటున్న 12 లక్షల మంది కస్టమర్లకు ఎంటర్ టెయిన్ మెంట్ సర్వీసెస్ విషయంలో అంతరాయం ఉండదని తెలిపింది. సంస్థలో విధులు నిర్వహిస్తున్న 500 మంది కొనసాగుతారని పేర్కొంది.

More Telugu News