అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా.. తెల్లవారుజామున ప్రయోగం
- రెండు నెలల శాంతికి చెక్ చెప్పిన కిమ్
- అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ప్రయోగం
- జపాన్ ఎకనమిక్ జోన్‌లో పడిన క్షిపణి
- అప్రమత్తంగా ఉన్నామన్న అమెరికా
రెండు నెలల క్రితం వరకు ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు, పరీక్షలు చేపట్టింది. అణు పరీక్షలు కూడా నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆంక్షలను తోసిరాజని వరుస పరీక్షలతో ఉద్రిక్తతలు నింపింది. ఒక దశలో అమెరికా-నార్త్ కొరియా మధ్య యుద్ధం తప్పదన్న వార్తలూ వచ్చాయి. అయితే, విచిత్రంగా నార్త్ కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ వెనక్కి తగ్గారు. రెండు నెలలుగా ఎటువంటి వార్తలు లేవు. తాజాగా ఈ తెల్లవారుజామున 3.17 గంటలకు ఐసీబీఎం ప్రయోగంతో ప్రపంచం దృష్టిని మరోమారు తనవైపు తిప్పుకున్నారు.