ivanka trump: హైదరాబాదు నుంచి తొలి ట్వీట్ చేసిన ఇవాంకా ట్రంప్

షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ చేరుకున్నారు. పటిష్ట భద్రత మధ్య ఆమె ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. అనంతరం ఆమె కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఉదయం 10.22 గంటలకు ఆమె భాగ్యనగరం నుంచి తొలి ట్వీట్ చేశారు. "అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు. హైదరాబాదులో ఉండటం పట్ల ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నా" అంటూ ట్విట్టర్ ద్వారా ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ... ఇవాంకా ట్రంప్ ట్వీట్ కు ప్రతిస్పందించారు. 'వెల్ కమ్ టు ఇండియా' అంటూ ట్వీట్ చేశారు. 
Go Back to Shorts
ivanka trump
Narendra Modi

More Telugu News