అప్పుడు మాత్రం నేను చాలా బాధపడ్డాను: సింగర్ గీతామాధురి
- నన్నూ .. నందూను ఓ టీవీ షోకి గెస్టులుగా పిలిచారు
- మేం వస్తే ఆ ప్రోగ్రాం చేయమని కొంతమంది సింగర్స్ చెప్పారట.
- నేను పాడిన చాలా పాటలను మరో సింగర్ తో పాడించిన సందర్భాలు వున్నాయి
"ఆ సింగర్స్ ఆ తరువాత నాకు చాలాసార్లు కలిశారు. మొదట్లో ఎందుకలా చేశారు .. అని అనుకునేదాన్ని కానీ .. నాతో బాగానే వుంటున్నారు గదా అని ఆ విషయాన్ని గురించి ఆలోచించడం మానేశాను" అని చెప్పింది. ఇక మరో ప్రశ్నకి సమాధానమిస్తూ .. "నేను పాడిన పాటలను మళ్లీ వేరే సింగర్స్ తో పాడించిన సందర్భాలు .. అలాగే ముందుగా వేరే సింగర్ తో పాడించిన పాటలు ఆ తరువాత నాతో పాడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి" అని చెప్పుకొచ్చింది.