సెల్‌టవర్ ఎక్కిన ఫాతిమా కాలేజీ విద్యార్థులు.. తన వద్దకు రమ్మని చెప్పిన చంద్రబాబు
- తమ భవిష్యత్ నాశనం అయిందని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన
- సెల్‌టవర్ ఎక్కిన వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్
- రేపు ఉదయం తనను కలవాలని కబురు
తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని అంటున్నారు. తమకు న్యాయం చేస్తామనే హామీ ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరిస్తున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని కిందకు దిగమని కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ వద్ద తనను కలవాలని తెలిపారు. కాగా, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యలపై ఈనెల 28న ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఢిల్లీకి వెళ్లనున్నారు.