కేసీఆర్ ను కలిసిన సంపూర్ణేష్ బాబు!
- కేసీఆర్ ను తొలిసారి కలిసిన సంపూ
- 2019 ఎన్నికల్లో సంపూ చరిష్మాను ఉపయోగించుకునే అవకాశం
- కేసీఆర్ ను కలిసిన పలువురు సెలబ్రిటీలు
తెలంగాణ ప్రాంతానికి చెందిన సంపూర్ణేష్ బాబుకు సినీ అభిమానుల్లో మంచి చరిష్మా ఉంది. దీంతో, 2019 ఎన్నికల్లో సంపూ చరిష్మాను ఉపయోగించుకోవాలని కేసీఆర్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ తో సంపూ భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకు ముందు పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. వారిలో ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా ఉంది.