కొత్త పార్టీ పెట్టే యోచనలో కోమటిరెడ్డి బ్రదర్స్? రామోజీరావును కలసి సహకారం కోరిన వెంకటరెడ్డి!
- కాంగ్రెస్ హైకమాండ్ తీరు పట్ల గుర్రు
- రామోజీని కలసి సలహాలు తీసుకున్న కోమటిరెడ్డి
- 2019లో చక్రం తిప్పాలనేదే వ్యూహం
ఈ నేపథ్యంలో, వీరి అడుగులు కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా పడుతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న రామోజీ గ్రూపు అధినేత రామోజీరావును కలిశారు. దాదాపు అరగంట సేపు ఆయనతో చర్చలు జరిపారు. తమకు మీ ఆశీస్సులు కావాలని ఈ సందర్భంగా రామోజీని కోమటిరెడ్డి కోరారట. కాంగ్రెస్ లో కొనసాగాలా? వద్దా? అనే సలహాను కూడా రామోజీ నుంచి తీసుకున్నారట. తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి సూచనలను కోరారట. ఈ విషయం ఇప్పుడు టీకాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ పెడితే, ఒకవేళ 2019లో తెలంగాణలో హంగ్ వస్తే, తాము చక్రం తిప్పవచ్చనే ఆలోచనలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారట. మరి ఏం జరగనుందో తెలవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.