మరోసారి గాయాలపాలైన హీరోయిన్ కంగనా రనౌత్!
- షూటింగ్ జరుగుతుండగా ఈ ఏడాది జూలైలోనూ గాయాలు
- ప్రస్తుతం జోధ్‌పూర్‌లో మణికర్ణిక సినిమా షూటింగ్
- ఓ సన్నివేశం కోసం స్టంట్ చేస్తుండగా కాలికి గాయం
- కొన్ని వారాలు విశ్రాంతి
ఈ ఘటనపై ఆమెకు చికిత్స చేస్తోన్న వైద్యుడు మాట్లాడుతూ కంగన కుడి కాలు బెణికిందని అన్నారు. ఆమెకు చికిత్స చేశామని, కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. చికిత్స తీసుకుని ఆమె జోధ్‌పూర్ నుంచి ముంబయికి వెళ్లారు. మణికర్ణిక సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.