మోడల్‌గా ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన కెండల్ జెన్నర్
- వెల్లడించిన ఫోర్బ్స్ మేగజైన్
- గతేడాది 22 మిలియన్ డాలర్లు వెనకేసుకున్న కెండల్
- రెండో స్థానంలో జిసెల్ బుండ్‌చెన్
ఇక గత 15 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉన్న జిసెల్ బుండ్‌చెన్ ఇప్పుడీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిసెల్ సంపాదన 17.5 మిలియన్ డాలర్లు. మూడో స్థానంలో క్రిస్సీ టైజన్ (13.5 మిలియన్ డాలర్లు) ఉంది. టాప్ 10లో ఉన్న మోడళ్ల సంయుక్త సంపాదన 109.5 మిలియన్ డాలర్లు ఉన్నట్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. అయితే ఈ సారి జాబితాలో ఉన్న మోడళ్లలో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉన్నవారే కావడం గమనించాల్సిన విషయమనే ఫోర్బ్స్ తెలిపింది.