'మిడిల్ క్లాస్ అబ్బాయి' ముందుగానే వస్తున్నాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మిడిల్ క్లాస్ అబ్బాయి' ముందుగానే వస్తున్నాడట!

  • వారం రోజుల ముందుగానే 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
  • డిసెంబర్ 22వ తేదీన అఖిల్ మూవీ 'హలో' 
  • ఆ మరుసటి రోజునే అల్లు శిరీష్ 'ఒక్క క్షణం
నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రం రూపొందింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక 22 వ తేదీన అఖిల్ సినిమా 'హలో' ప్రేక్షకుల ముందుకు రానుంది. 23వ తేదీన అల్లు శిరీష్ 'ఒక్క క్షణం' విడుదల చేయాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారు.

 అయితే వరుస సినిమాలు విడుదల పెట్టుకోవడం వలన థియేటర్స్ సమస్య తలెత్తే ఛాన్స్ వుంది. అంతేకాదు వసూళ్లపై కూడా ప్రభావం పడే అవకాశం వుంది. ఈ విషయాన్ని గురించే అల్లు అరవింద్ .. దిల్ రాజు మధ్య చర్చలు జరిగాయట. చివరికి దిల్ రాజు తన సినిమా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ను డిసెంబర్ 15వ తేదీనే విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేయనున్నారని అంటున్నారు. అలా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ముందుగానే ప్రేక్షకులను పలకరించే ఛాన్స్ ఉందన్న మాట.   
nani
sai pallavi
bhoomika

More Telugu News